రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలికను వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో మృతి చెందింది.
రుద్రారం (కర్నూలు జిల్లా) : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలికను వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా రుద్రారం మండలం ఆలమూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఆలమూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి ముగ్గురు కుమార్తెలు.
కాగా వారిలో పెద్ద కుమార్తె పుష్ప శుక్రవారం దుకాణం దగ్గరకు వెళ్లి సరుకులు తెస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓబులేష్ బైక్పై వెళ్తూ పాపను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కాగా లక్ష్మీదేవి భర్త వారం క్రితమే చనిపోగా, ఇప్పుడు కుమార్తె చనిపోవడంతో ఆమె దుఃఖ సాగరంలో మునిగిపోయింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.