
సాక్షి, శ్రీకాకుళం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్ వద్ద ఇరువై లారీలు చిక్కుకుపోయాయి. లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు. తొలుత 24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆధ్వర్వంలో మిగిలిన వారిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న 53 మందిని కాపాడామని, వర్షా కాలంలో నదుల్లో పనిచేసేముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment