ఆరో తరగతి విద్యార్థి స్కూలుకు బుల్లెట్లు తీసుకువచ్చి కలకలం సృష్టించాడు.
హైదరాబాద్: ఆరో తరగతి విద్యార్థి స్కూలుకు బుల్లెట్లు తీసుకువచ్చి కలకలం సృష్టించాడు. వీటిని తోటి విద్యార్థులకు పంచుతుండగా, క్లాస్ టీచర్ గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగింది.. తుపాకీ సంస్కృతికి పెట్టింది పేరైన అమెరికాలో కాదు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
కాగా ఈ విషయాలను వెల్లడించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. అంతేగాక అక్కడికొచ్చిన మీడియా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మీడియా ఈ ఘటనను డీఎస్పీ సరిత దృష్టికి తీసుకెళ్లింది. స్కూలుకు బుల్లెట్లు తీసుకువచ్చిన విద్యార్థి తండ్రి కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టు సమాచారం.