విశాఖపట్టణం: జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్‌ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్‌ఫ్లూగా నిర్ధారణకాగా, రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్‌గా తేలాయని తెలిపారు. స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటంతోపాటు..12 బృందాలతో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, స్వైన్‌ఫ్లూ బాధిత కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు చేయటంతోపాటు వారికి ముందు జాగ్రత్తలు వివరిస్తామన్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి మాస్క్‌లు అందజేయనున్నట్లు చెప్పారు.