జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను స్వాహా చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులు శుక్రవారం ఉదయం అరెస్టయ్యారు.
తూర్పుగోదావరి: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను స్వాహా చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులు శుక్రవారం ఉదయం అరెస్టయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉపాధి హామీ పథకంలో రూ.70 లక్షల నిధుల స్వాహాపై గతేడాది డిసెంబర్‌లో కేసు నమోదు అయింది. మిగిలిపోయిన నిధులను కొల్లగొట్టేందుకు.... పనులు చేయకపోయినా చేసినట్టు చూపించి రూ.70 లక్షలు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకం ఏపీవో నాగేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్లు బాబు, బుల్లెబ్బాయిలతో పాటు నిధులు మళ్లించేందుకు ఖాతాలను సమకూర్చిన మరో ఐదుగురిని ఏఎస్పీ ఫకీరయ్య ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
(రంపచోడవరం)