విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఖరారైన పర్యటన కొద్దిమార్పులు చేర్పులతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 9న ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న గిరిజనోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజన విద్యార్థులు, కళా బృందాలు రానున్నాయని, నగరంలో వేదిక ఖరారు కావలసి ఉందని వివరించారు.
8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటన
Published Fri, Aug 1 2014 12:53 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
Advertisement
Advertisement