
విజయవాడలో విషాదం
‘‘ నాని అనే యువకుడు రోజూ అక్కను వేధిస్తుండేవాడు. నిన్న కూడా స్కూల్‌కు వెళ్తుంటే అసభ్యకరంగా మాట్లాడాడు. అక్కకు కోపం వచ్చి చెప్పు తెగుద్దని హెచ్చరించింది. దీంతో అతను అక్క ముఖంపై ఉమ్మేశాడు. గతంలో నాని ఇలాగే వేధించేవాడు. ఈ విషయాన్ని బాబాయ్‌కు కూడా చెప్పాం’’ అని స్వాతి చెబుతోంది. విద్యార్థిని మరణంపై పూర్తి విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.