ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన కర్నూలు పట్టణంలోని మెడికల్ కాలేజి ఎదుట సోమవారం జరిగింది.
కర్నూలు: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన కర్నూలు పట్టణంలోని మెడికల్ కాలేజి ఎదుట సోమవారం జరిగింది. రోడ్డు దాటుతున్న యువకున్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టడానికి వీళ్లేనంతగా చిద్రమవడంతో.. అతని వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.