గుంటూరు: ప్రత్తిపాడు తహశీల్దార్ ఏసుబాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కాంతిలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతోపాటు ప్రత్తిపాడు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నడింపల్లి వీఆర్‌వోలను కూడా సస్పెండ్ చేశారు. ఒక భూమి వ్యవహారంలో తప్పుడు నివేదిక ఇవ్వటంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించేందుకు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీ సృష్టించారు. ఈ వ్యవహారంలో వీరందరి సహకారం ఉందని నిర్ధారించుకున్న కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.