తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌హాల్‌లో ఆర్‌వో, ఏఈఆర్, బూత్ లెవల్ అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 6.54 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.64 కోట్ల మంది (41 శాతం) అనుసంధానం పూర్తి చేసుకున్నారని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో 30 లక్షల మంది ఓటర్లుండగా 20 లక్షల మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. ఆధార్ కార్డులేని వారి కోసం అన్ని మండల కేంద్రాల్లో పర్మినెంట్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్ అనుసంధానాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా చేసుకోవచ్చన్నారు. గతంలో ఓటరు కార్డు పొందిన వారు బూత్‌లెవల్ అధికారుల వద్ద ఫొటోలు ఇచ్చి మార్చుకోవచ్చని చెప్పారు. ఇలా మార్చుకున్న వారికి జూలై చివరికల్లా స్మార్ట్‌కార్డు ఉచితంగా ఇస్తామన్నారు. సరైన సమయంలో ఆధార్ అనుసంధానం పూర్తిచేసిన అధికారులకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ముగ్గురికి రూ.25 వేల వంతున బహుమతి ఇస్తామని చెప్పారు.
15 లోపు ఆధార్ అనుసంధానం పూర్తి..
Published Thu, Apr 30 2015 9:13 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement