అవినీతి రహితపాలన అందిస్తామంటూర్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ జేబులోకి వెళ్ళిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు.
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ :
అవినీతి రహితపాలన అందిస్తామంటూర్టీ ఆమ్ ఆద్మీ పా ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ జేబులోకి వెళ్ళిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నీతి, నిజాయితీ అంటూ ఢిల్లీ ప్రజలను మోసం చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్కువ రోజులు పాలించదన్నారు. ఢిల్లీలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా అవి నీతి, కుంభకోణాల్లో కూరుకుపోయినా కేజ్రీవాల్‌కు కనబడడంలేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటే, కాంగ్రెస్‌కు షాడో పార్టీ అని అర్థమవుతోందన్నారు.
బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు. నేడు అటల్‌బిహారీ వాజ్‌పాయ్ జన్మదినవేడుకలను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. సమా వేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంచ అని ల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, నగర అధ్య క్షుడు న్యాలం రాజు, బద్దంకిషన్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.