Corruption-free regime
-
చందా కొచర్‌పై లుక్ అవుట్ నోటీసు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదైన వారం వ్యవధిలోనే నోటీసులపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. చందా కొచర్ స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఇప్పటిదాకా ఆమెకు సమన్లేమీ జారీ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు పారిపోకుండా నిలువరించేందుకు సీబీఐ లుక్ అవుట్ నోటీసును ఇమిగ్రేషన్ అధికారులకు పంపుతుంది. ఒకవేళ నిందితులు అటువంటి ప్రయత్నమేదైనా చేసిన పక్షంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. అంతకు ముందే చందా కొచర్ రాజీనామా చేసినప్పటికీ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో సీబీఐ ప్రస్తావించింది. -
ఆగని అవినీతి..!
బాన్సువాడ: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంతోనూ అవినీతికి చెక్ పడడం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అమ్మకందారు, కొనుగోలుదారుకు మధ్య జరిగే ఒప్పం దం, రిజిస్ట్రేషన్ తంతు మొత్తం వీడియో కెమెరాల్లో బంధించి, వాటి సీడీలను కొనుగోలుదారుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా ప్రి రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్లు వెబ్సైట్లో పెట్టడం తదితర చర్యలు చేపట్టింది. ఈ మేరకు గతేడాది ఉమ్మడి జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను బిగించారు. ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు మీ సేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసి, స్లాట్ బుక్ చేసుకొన్న తర్వాత నిర్ణీత తేదీలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి తమ పేరిట డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తుల వివరాలను, మార్కెట్ విలువను, స్టాంప్ డ్యూటీని, అమ్మకం దస్తావేజులను, స్థిరాస్థి విక్రయం, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లను, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లను ఉంచడంతో ప్రజలకు సౌకర్యంగా మారింది. అయితే కొందరు సబ్ రిజిస్ట్రార్ల నిర్లక్ష్యంతో సీసీ కెమెరాల నిర్వహణ సరిగా జరగడం లేదు. క్రయవిక్రయాల సీడీలను అందించడం లేదు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సదుద్దేశంతోనే చర్యలు చేపట్టింది. అయితే దస్తావేజు లేఖరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. యథేచ్ఛగా కార్యకలాపాలు అధికారులు, దళారుల మధ్య ఉన్న అవగాహన కారణంగా నిఘా కొరవడుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నా, అవినీతి మాత్రం ఆగడం లేదు. వీరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో యథేచ్ఛగా తిరుగుతూ దరఖాస్తుదారుడికి, అధికారులకు మధ్య మంతనాలు జరిపి, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దస్తావేజు లేఖరులు లేనిదే రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి కావడం లేదు. సబ్ రిజిస్ట్రార్లు స్పందిస్తేనే మధ్యవర్తులను నియంత్రించవచ్చు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లోన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి సాయంత్రం 5గంటల వరకు మధ్యవర్తులు అక్కడే తిష్టవేస్తున్నారు. అధికారులు, కొనుగోలుదారులకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులను తయారు చేసి ఇవ్వడం వరకే పని చేయాలి. అయితే అధికారుల వద్దకు తమ డాక్యుమెంట్లు తీసుకెళ్తూ యథేచ్ఛగా తమ పని చేస్తున్నారు. తమ ద్వారా వెళితేనే ఫలానా సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేస్తారని, లేకుంటే మీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని తమవైపు తిప్పుకొంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, బోధన్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, ఆర్మూర్ పట్టణాల్లో ప్రస్తుతం ప్లాట్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే కొత్తగా స్థలాలు కొన్న, అమ్మినవారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే అమ్యామ్యాలు ఇవ్వనిదే పనులు పూర్తి కావడం లేదు. నేరుగా వస్తే రిజిస్ట్రేషన్లు చేస్తాం ఆన్లైన్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా మారింది. ఇల్లు, ప్లాటు, వ్యవసాయ భూమి తదితర విక్రయాలకు సంబంధించిన నమూనా దస్త్రాలు ఆన్లైన్లో ఉన్నాయి. నేరుగా వాటి ద్వారా డాక్యుమెంట్లు తయారు చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అవినీతికి ఎక్కడా తావు లేదు. కొనుగోలుదార్లు కోరితే క్రయవిక్రయాలకు సంబంధించిన సీసీలను అందిస్తాం. –స్వామిదాస్, సబ్ రిజిస్ట్రార్, బాన్సువాడ. -
ఎవరికి చెప్పాలే
ఏసీబీ చిరునామా తెలియని బాధితులు అవగాహన కల్పించే విషయాన్ని మరిచిన ఏసీబీ ఎక్కడా దర్శనమివ్వని పోస్టర్లు, బోర్డులు అవినీతి రహిత పాలనకు తోడ్పాటు, వివిధ శాఖల్లో జరిగే అవినీతిపై సమాచార సేకరణ, అవినీతి నిర్మూలనపై నిరంతర పరిశీలన, దీని కోసం ప్రజల సహకారం తీసుకోవడం, అవినీతి వ్యతిరేక చట్టాలు పటిష్టంగా అమలు చేయ డం, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడం... ఇదీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన లక్ష్యం(మిషన్). ఈ లక్ష్యం కోసం అవినీతి నిరోధక శాఖ తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బం ది వల్ల ఇబ్బంది పడేవారు.. ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలనే సమాచారాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా పెట్టాలి. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లను అందరికీ తెలియజేయాలి. ఏసీబీకి ఉన్న టోల్‌ప్రీ నంబర్ 155361ను వీలైనన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా పెట్టాలి. అవివీతి నిరోధక శాఖ జిల్లా విభాగం మాత్రం ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనుకడుగు వేస్తోంది. ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ ఫిర్యాదులు వచ్చి.. పని ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారో ఏమో.. ఏసీబీ జిల్లా అధికారులు అవగాహన కల్పించే విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టారు. జిల్లా కేంద్రంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఏబీసీకి సంబంధించిన పోస్టర్లుగానీ, బోర్డులుగానీ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ యం త్రాంగం అవినీతి వల్ల ఇబ్బంది పడేవారు ఎవరికి ఫిర్యాదు చేయాలనే సమాచా రం జిల్లావ్యాప్తంగా ఎక్కడా లేకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా ఇలాగే... అవినీతి నిరోధక శాఖకు సంబంధించి జిల్లాలో డీఎస్పీ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఏసీబీ వరంగల్ విభాగం పరిధిలో మరో నలుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు. వీరితోపాటు కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు పెరగుతుండడంతో పాటు జిల్లా వ్యాప్తంగా భూములకు డిమాండ్ ఉండడంతో... రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతికి అంతులేకుండాపోరుుంది. మిగిలిన శాఖల్లోనూ అవినీతి ఉన్నా... ఈ రెండు శాఖల్లో మాత్రం ఉన్నతాధికారుల స్థాయిలోనే అవినీతి సాగుతోంది. భూ వివాదాల పరిష్కారం పేరిట పోలీసు శాఖ సైతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలతో అవినీతి విషయంలో పోటీ పడుతోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల, పోలీసు శాఖ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో బయటి వ్యక్తుల పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది అంతటా తీవ్రంగానే ఉంది. సొంత భూమికి సంబంధించి అధికారి పత్రాలు కావాలన్నా రెవెన్యూ అధికారులు ఎంతో కొంత ముట్టజెప్పనిదే పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఎవరైనా అనుకున్నా... ఎక్కడా ఎలాంటి సమాచారం ఉండడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాల్సిన సమాచారంపై ఏసీబీ బోర్డులు, పోస్టర్లు వేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ప్రభుత్వ సిబ్బందికి సహకరించే ఉద్దేశంతోనే ఏబీసీ ఇలా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏసీబీ కేసుల పురోగతి తీరును చూసినా ఇలాగే అనిపిస్తోంది. పొరుగు జిల్లాలతో పోల్చితే వరంగల్ విభాగం ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. జిల్లాలో ఏసీబీ కేసుల వివరాలు... 2011 13 2012 16 2013 19 2014 11 -
ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తాం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల నాలుగున్నర దశాబ్దాల పోరాటా లు, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజే పీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివా రం సాయంత్రం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అదే సమయంలో నరేంద్రమోడీ, బీజేపీలకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. సుసి ్థర, సమర్థవంతమైన, అవినీతిరహిత పాలనకోసం వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలతో పాటు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్తో దోస్తీ ఎందుకు కట్టారు ‘అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. రాష్ట్రం విడిపోతే నష్టాలను వివరించారు. అయితే 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు తెలియవా? అప్పుడు పొత్తును ఎందుకు అడ్డుకోలేదు’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కలిసుంటే లేదు సుఖం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతో నష్టపోయిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సాగు భూములకు నీళ్లు లేక, కరెంటు సరఫరా కాక ఈ ప్రాంత రైతులు అనేక అవస్థల పాలై గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అక్కడా నష్టాలపాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి శవాలను తేవడానికి కూడా ఈ ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అనేక నష్టాలకు గురిచేసిందన్నారు. తెలంగాణ కోసం వేలాది మందిని జైళ్లపాలు చేసిందని, ఎందరో కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఆందోళన వద్దు.. సవరణల పేరుతో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ పెట్టి, అసెంబ్లీలో ఓడించే కుట్రలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటులో బీజేపీ తెలంగాణ బిల్లును గెలిపిస్తుందని పేర్కొన్నారు. సమర్థతకు, అసమర్థతకు పోరాటం వచ్చే ఎన్నికల్లో సమర్థతకు, అసమర్థతకు పోరాటం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసరాలు, పెట్రోల్, వంటగ్యాస్, ఎరువులు, ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు... ఇలా అన్నింటి ధరలు పెంచి పేద, మధ్యతరగతిపై మోయలేని భారాన్ని మోపిందని ఆరోపించారు. అన్నింటా అవినీతికి పాల్పడుతోందన్నారు. తాగేందుకు నీళ్లివ్వని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఊరూరా పారిస్తోందంటూ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాయన్నారు. అక్కడ కరెంటు సమస్య లేదన్నారు. పారిశ్రామికవేత్తలు అక్కడికి పరుగులు పెడుతున్నారంటే అక్కడ నీతివంతమైన పాలన, నాణ్యమైన కరెంటు ఇవ్వడమే కారణమన్నారు. అవినీతి నిర్మూలన జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఇప్పుడేమైనా 24 గంటలిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సమస్య ఉంటుందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇప్పుడేమైనా కరెంటు 24 గంటలు ఇస్తున్నారా అని బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గుజరాత్‌లాగే కరెంటును మెరుగుపర్చుకుంటామన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని, తమ పార్టీ బిల్లును పాస్ చేయిస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీరుస్తుందన్నారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు ధర్మారావ్, లోక భూపతిరెడ్డి, మోతె కృష్ణాగౌడ్, ప్రభాకర్ యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, విఠల్‌గుప్తా, బాపురెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఆలూర్ గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పుల్లూరి సతీశ్, సుధాకర్, రంజిత్ మోహన్, హరిస్మరణ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, లింబాద్రి, లింగారెడ్డి, గీతారెడ్డి, సంగారెడ్డి, శైలజ, వసుధారెడ్డి, తదితరులు పాల్గొనారు. షబ్బీర్ హస్తం తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ హస్తం ఉందని నిట్టు వేణుగోపాల్‌రావు ఆరోపించారు. షబ్బీర్‌అలీ నియోజకవర్గ అభివృద్ధి చేసిందేమీ లేదని, ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల అభివృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. షబ్బీర్‌అలీపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌గౌడ్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. పండుగలు కూడా జరుపుకోకుండా టపాకాయలు అమ్మడాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్ జేబులోకి వెళ్లిన ‘ఆమ్ ఆద్మీ’
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అవినీతి రహితపాలన అందిస్తామంటూర్టీ ఆమ్ ఆద్మీ పా ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ జేబులోకి వెళ్ళిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నీతి, నిజాయితీ అంటూ ఢిల్లీ ప్రజలను మోసం చేసిన ఆమ్ఆద్మీ పార్టీ ఎక్కువ రోజులు పాలించదన్నారు. ఢిల్లీలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా అవి నీతి, కుంభకోణాల్లో కూరుకుపోయినా కేజ్రీవాల్‌కు కనబడడంలేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటే, కాంగ్రెస్‌కు షాడో పార్టీ అని అర్థమవుతోందన్నారు. బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు. నేడు అటల్‌బిహారీ వాజ్పాయ్ జన్మదినవేడుకలను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. సమా వేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంచ అని ల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, నగర అధ్య క్షుడు న్యాలం రాజు, బద్దంకిషన్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.