తడ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి | acb attacks on tada checkpost | Sakshi
Sakshi News home page

తడ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

Published Wed, Jan 20 2016 9:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb attacks on tada checkpost

సూళ్లూరు పేట:  నెల్లూరు జిల్లా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. కాంపౌండ్ ఫీజు కంటే అదనంగా ఉన్న 46,640 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెక్‌పోస్టు పరిసరాల్లో వెతగ్గా రూ.7,980 ఒకచోట, రెండు 500 రూపాయల నోట్లు మరో చోట దొరికాయి.
 
వీటిని సిబ్బంది లోపలి నుంచి విసిరివేసి ఉంటారని భావిస్తున్నారు. చెక్‌పోస్టులో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న వాణిజ్యపన్నుల శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ దాడిలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ప్రభాకరరావు, సీఐ శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement