గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎంఎస్ అగర్వాల్ విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది.
గోదావరి బోర్డు చైర్మన్ బాధ్యతల స్వీకరణకు అగర్వాల్ విముఖత
హైదరాబాద్: గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన గోదావరి నదీ యాజ మాన్య బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎంఎస్ అగర్వాల్ విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో చైర్మన్ బాధ్యతలను తాను మోయలేనని అగర్వాల్ కేంద్ర జల సంఘానికి విన్నవించినట్టు సమాచా రం. గోదావరి, కృష్ణా బోర్డులకు తాత్కాలిక చైర్మన్ల స్థానంలో ఎం.ఎస్.అగర్వాల్, ఎస్.కె.జి.పండిత్‌లను నూతన చైర్మన్లుగా నియమిస్తూ గత నెల 27న కేంద్ర జల సంఘం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
వీరిలో అగర్వాల్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించలేననే తన నిర్ణయాన్ని కేం ద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యా దృష్టికి తీసుకెళ్లినట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలి సింది. రిటైర్‌మెంట్ దగ్గరలో ఉన్న తన స్థానంలో సర్వీసు కాలం ఎక్కువగా ఉన్న వారిని నియమించాలని, అలా అయితేనే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వివరించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానం లో ఎవరిని నియమించాలన్న దానిపై కేంద్ర జల సంఘం దృష్టి పెట్టినట్లు తెలిసింది. సర్వీసుకాలం ఎక్కువగా ఉన్న సి.ఎ.వి.నాథన్, డి.పి.సింగ్, ఎస్.కె.శ్రీవాత్సవ్, ఎస్.మసూద్ హుస్సేన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.