విజయనగరం రూరల్ : జిల్లాలోని 13 మద్యం దుకాణాలకు సంబంధించి ఏజేసీ యూజీసీ నాగేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో లాటరీ ప్రక్రియ నిర్వహిం చారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ని 202 మద్యం దుకాణాలను నూతన మద్యం విధానం ద్వారా లెసైన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ గత నెల 23న దరఖాస్తులు ఆహ్వానించగా 186 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. వాటికి జూన్ 27న లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు కేటాయించారు. మిగిలిన 16 మద్యం దుకాణాలకు గాను గత నెల 30న దరఖాస్తులు ఆహ్వనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ మరోసారి విడుదల చేశారు.
సోమవారం వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించి అదే రోజు లాటరీ నిర్వహిస్తామ ని అధికారులు ప్రకటించారు. అయితే 16 మద్యం దుకాణాలకు గాను 13 మద్యం దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 12 మద్యం దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా, ఎల్.కోట మండలం జమ్మాదేవి పేట మద్యం దుకాణానికి అత్యధికంగా 10 దరఖాస్తు లు వచ్చాయి. 13 మద్యం దుకాణాల ద్వారా దరఖాస్తు ఫీజు రూపేణా ప్రభుత్వానికి రూ.5.5లక్షల ఆదాయం సమకూరింది. 13 మద్యం దుకాణాలకు ఏజేసీ కార్యాల యంలో లాటరీ నిర్వహించి తాత్కాలిక లెసైన్స్‌లు జారీ చేశారు.
ఇంకా చీపురుపల్లి సర్కిల్ పరిధిలోని వెదుళ్లవల స, కొత్తవలస సర్కిల్ పరిధిలోని చింతలపాలెం, బొబ్బి లి సర్కిల్ పరిధిలోని సీతానగరం-2 మద్యం దుకాణాల కు లెసైన్సులు జారీ చేయాల్సి ఉంది. ఈ మూడు దుకాణాలకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో విజయనగ రం, పార్వతీపురం ఈఎస్‌లు పి.శ్రీధర్, వెంకటరావు, ఏఈఎస్ వెంకటరామిరెడ్డి, ఎక్సైజ్ సీఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు లాటరీ
Published Tue, Jul 8 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement