100 కిలోమీటర్ల దూరంలో వీఆర్వో పరీక్ష కేంద్రాలు
అభ్యర్థులకు తంటాలు, ఆటంకాలు ఖాయం
అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపణలు
‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అన్నట్లుగా.. వీఆర్వో పరీక్ష రాసే అభ్యర్థులు చేరుకోవాల్సిన పరీక్ష కేంద్రం ‘జీవిత కాలం సుదూరం’ అనే చందంగా మారింది అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా. అందుకు ఉదాహరణలివిగో..
మోమిన్‌పేట మండలం టేకులపల్లికి చెందిన వనజాక్షి ఆదివారం వీఆర్వో పరీక్షకు హాజరు కానుంది. పరీక్ష కేంద్రం ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల. ఆమె ఇక్కడికి చేరుకోవాలంటే కనీసం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. ఉదయం 10గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ముందు రోజు రాత్రే అన్నీ సర్దుకుని రావాలి.
యాలాలకు చెందిన మోయిజ్‌కు సైతం ఇదే సమస్య తలెత్తింది. మేడ్చల్ మండలంలోని నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన వీఆర్వో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో ఆయన యాలాల నుంచి తాండూరుకు, అక్కణ్నుంచి హైదరాబాద్.. సికింద్రాబాద్ మీదుగా ప్రయాణం చేయాలి. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే కనిష్టంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.
యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన వి.సత్యనారాయణకు బీహెచ్‌ఈఎల్ ప్రభుత్వ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయిస్తూ హాల్ టికెట్ వచ్చింది. అక్కణ్నుంచి ఆయన పరీక్షకు హాజరుకావాలంటే వంద కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి రావాల్సిందే.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సుదూర ‘పరీక్ష’!
Published Fri, Jan 31 2014 5:59 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement