
బాలింతకు వాహనం ఏర్పాటు చేసి పంపుతున్న పోలీసులు
కళ్యాణదుర్గం టౌన్: లాక్‌డౌన్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు బాలింతకు వాహనం సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ వెంకటరమణ.. ఓ బాలింత ద్విచక్రవాహనంపై వెళ్లడం చూసి చలించిపోయారు. వెంటనే వారిని ఆపి తమ వాహనం సమకూర్చి ఇంటికీ క్షేమంగా పంపారు. మండల పరిధిలోని ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ ఈనెల 13న కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు డిశ్చార్జ్ చేయడంతో భర్త ప్రసాద్‌తో కలిసి బిడ్డతో ఎండలో ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. గమనించిన డీఎస్పీ వెంకటరమణ తన వాహనంలో బాలింతను క్షేమంగా ఇంటికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment