
సాక్షి, తూర్పు గోదావరి: ఏజన్సీ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు ప్రస్తావించకుండా కేవలం ప్రతిపక్ష నాయకుడిని విమర్శించటం దారుణమని రంపచోడవరం వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. ఏజన్సీలో ఉన్న ప్రతీ సమస్య మీదా జగన్ స్పందించి, బాధితులకు సహాయం కూడా అందించారన్నారు. గిరిజనులు ప్రాణాలు కోల్పోయిన ఏ సందర్భంలోనూ పవన్ కల్యాణ్ పట్టించుకోలేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా, ఆవేశంతో నాలుగు సినిమా డైలాగులు చెప్పి వెళ్ళిపోతే గిరిజనులు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న బాధలు పవన్ కళ్యాణ్‌కు తెలియవా ? చాపరాయి మాతా శిశు మరణాలు, లాంచీ ప్రమాదం వంటి సంఘటనలు జరిగిన సమయాల్లో స్పందించని పవన్ కళ్యాణ్ గిరిజనులను ఉద్ధరిస్తాడా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment