బిల్లును అడ్డుకున్నది ఆంధ్ర పార్టీలే: హరీష్
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి గోల్నాకలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ, శాసనమండలిలలో ఆంధ్ర నాయకులే అధినాయకులుగా ఉన్నందున బిల్లుపై చర్చజరగకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కాగా, టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన మోహన్‌రెడ్డి, కేకే శ్రీనివాస్, లింగం, వారి అనుచరులు ఉన్నారు.