
పీఆర్సీపై నిర్ణయం తీసుకోని ఏపీ కేబినెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పనులను స్విస్ ఛాలెంజింగ్ విధానం ద్వారా మాస్టర్ డెవలపర్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణ బాధ్యతల గురించి చర్చించారు. పీఆర్సీపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు.
ఏపీ కేబినెట్ సమావేశంలో ఇంకా పలు విషయాలు చర్చకు వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసమీకరణకు రైతులను ఒప్పించేందుకు మంత్రుల బృందాన్ని పంపాలని కేబినెట్ నిర్ణయించింది. నీరు-చెట్టుపై సమగ్రంగా చర్చించారు. కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులు, అటవీ హక్కుల చట్టం మార్పులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. రోజ్వుడ్ తరహాలో ఎర్రచందనానికి కూడా అదే తరహాలో శిక్షా చట్టాలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.