తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు!
Published Mon, Oct 20 2014 9:56 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకుంటుందని ఆరోపిస్తూ కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. వరద జలాలతోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని లేఖలో ఏపీ ప్రభుత్వం సూచించింది.
మిగులు జలాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్ లో సమస్యలు ఎదురవుతాయని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించకపోతే ఇరు రాష్ట్రాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.
Advertisement