మాకొద్దీ టెలిమెట్రీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చేందుకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్, తనపరిధిలోని ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
ఏపీ పరిధిలోని పులిచింతల డ్యామ్,ప్రకాశం బ్యారేజీ, తదితర ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఔట్ ఫ్లో ప్రాంతాల వద్ద మాత్రమే టెలిమెట్రీ సరిపోతుందని, ఇన్‌ఫ్లో ప్రాంతాల్లో వద్దని ఏపీ చెబుతు న్నట్లుగా తెలిసింది. కాగా బోర్డు సభ్యులు బుధవారం నుంచి జూరాల, ఆర్డీఎస్, కేసీ కెనాల్, ముచ్చుమర్రి తదితరాల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలు అమర్చే అంశంపై సభ్యులు పరిశీలన చేయనున్నారు.