నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు గురువారం ధర్నాకు దిగారు.
విజయవాడ: నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు గురువారం ధర్నాకు దిగారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల తొలగింపు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. నోటికి బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు.