‘అనూహ్య కేసు’లో తీవ్రంగా స్పందించిన ముంబై హైకోర్టు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ముంబైలోని టీసీఎస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసి ఎస్తేర్ అనూహ్య హత్యకేసులో మహారాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఓ యువతి అదృశ్యమైనట్లు ఫిర్యాదు వస్తే అలుసా? దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడింది. దీనికి బాధ్యులపై తీసుకున్న చర్యలేమిటో నివేదించాలంటూ ఉన్నతాధికారుల్ని ఆదేశించింది.
ఎస్తర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ముంబై సామాజిక వేత్త, న్యాయవాది అభాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుల విషయంలో ఇప్పటివరకు కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, వాటిపై తీసుకున్న చర్యల్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది.
అదృశ్యం ఫిర్యాదులంటే అంత అలుసా?
Published Thu, Oct 30 2014 2:08 AM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement
Advertisement