శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రకాశం జిల్లాను పరిశీలించాలని కమిటీకి నివేదిక ఇచ్చామన్నారు. 13 జిల్లాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయా లని కోరినట్లు చెప్పారు. కమిటీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించిందన్నారు.