సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను శనివారం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరి భేటీ ఉండనుంది. ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం వైఎస్ జగన్ దాదాపు 40 నిముషాలపాటు చర్చించారు.
(చదవండి: దిశ చట్టం రూపుదాల్చాలి)
‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్ షాకు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment