ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు | APNGOs Movement for unite andhra | Sakshi
Sakshi News home page

ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు

Published Sat, Feb 8 2014 1:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు - Sakshi

ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు

నేటి నుంచి నిరసన కార్యక్రమాలు: ఏపీఎన్జీవోలు
 సాక్షి, హైదరాబాద్:  కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలి పారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల దహనం, ఎంపీల ఇళ్లముందు ధర్నాలు, 10న బ్యాంకులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 11న థియేటర్లు, వాణిజ్య సంస్థల మూసివేత, 12న జాతీయ రహదారుల దిగ్భంధం చేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేతనాలను త్యాగం చేసి ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తుంటే, సీమాంధ్ర కేంద్ర మంత్రులు సకల సౌకర్యాలు అనుభవిస్తుండడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు  వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 21వరకు జరగనున్న సమైక్య సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement