కోటబొమ్మాళి : శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల మంది కానిస్టేబుల్స్‌తో ఏపీఎస్‌పీ కొత్త బెటాలియన్ ఏర్పాటు చేయనున్నట్టు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎ.రవిచంద్ర తెలిపారు. కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి చిన్నరాజప్పతో మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ బెటాలియన్ ఏర్పాటుకు అవసరమైన వందెకరాలు స్థలాన్ని ఎచ్చెర్లలో కేటారుుంచారని మరో 60 ఎకరాల స్థలాన్ని ఫైరింగ్ శిక్షణకు కేటారుుంచారని తె లిపారు. విశాఖ రేంజ్ పరిధిలో సారవకోట, శ్రీకాకుళం ట్రాఫిక్, రణస్థలం, కోటబొమ్మాళి, ఎచ్చెర్లలో కొత్త పోలీస్‌స్టేషన్ భవనాలు నిర్మించామని చెప్పారు.
అలాగే 23 మంది ఏఎస్‌ఐలకు, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ శిక్షణకు పంపించామని డీఐజీ తెలిపారు. తమ పరిధిలో 500 మంది కానిస్టేబుల్స్‌ను నియమించనున్నట్టు చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మావోరుుస్టుల ప్రాబల్యం తగ్గిందని పేర్కొన్నారు. 18 మంది రిజర్వు సబ్‌ఇన్‌స్పెక్టర్లు నియమిస్తామని తెలిపారు. వీరికి గ్రేహేండ్స్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు.
శ్రీకాకుళంలో ఏపీఎస్‌పీ బెటాలియన్
Published Tue, Apr 5 2016 11:33 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement