తిరుమల ఆలయంలో జూన్ నెలలో స్వామివారికి నిర్వహించే మొత్తం 49,046 ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు.
తిరుమల : తిరుమల ఆలయంలో జూన్ నెలలో స్వామివారికి నిర్వహించే మొత్తం 49,046 ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు సులభంగా రిజర్వు చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం-6157, అర్చన-140, తోమాల-140, విశేషపూజ-750, అష్టదళపాద పద్మారాధన-80, నిజపాద దర్శనం-1115, కల్యాణోత్సవం-10,874, వసంతోత్సవం-6880, ఆర్జిత బ్రహ్మోత్సవం-6235, సహస్ర దీపాలంకార సేవ-13,775, ఊంజల్‌సేవ -2900 ఉన్నాయి.
మే 21వ తేదీ నుంచి ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ప్రసారం కానుంది. తిరుమల కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునేందుకు, శ్రీవారి సేవలో పాల్గొనేందుకు దరఖాస్తులు ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.