టీడీపీ, బీజేపీ పొత్తుపై ఓవైసీ మండిపాటు
హైదరాబాద్: తెలుగుదేశం(టీడీపీ), భారతీయ జనతాపార్టీ(బీజేపీ) పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడ్డారు. టీడీపీ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతోందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
టీడీపీ, బీజేపీ పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చూస్తూ టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు అని ఒవైసీ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని అసదుద్దీన్ జోస్యం చెప్పారు.
బీజేపీతో టీడీపీ పొత్తుపై ఇరు పాంత్రాల్లోనూ, రెండు పార్టీల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో కీలక పొత్తు జరిగిన నేపథ్యంలో నిర్వహించిన సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.