కలవని మనసులు | tdp candidates,bjp candidates are alliance | Sakshi
Sakshi News home page

కలవని మనసులు

Published Sun, Apr 27 2014 3:06 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

కలవని మనసులు - Sakshi

కలవని మనసులు

- కూటమిలో పొసగని పొత్తులు ఎవరికి వారుగా
- బీజేపీ, టీడీపీ అభ్యర్థులు
- నాలుగు చోట్ల కమలానికి సహాయ నిరాకరణ
- తెలుగుదేశంతో కలిసి నడవని కమలనాథులు
- ఇందూరులో వ్యవహారం బెడిసినట్లే
 

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ, తెలుగుదేశం పార్టీల పొత్తు జిల్లాలో పొసగలేదు. సీట్ల సర్దుబాటు సందర్భంగా నారాజైన ఇరు పార్టీల నేతల మనసులు కలవలేదు. ఐదు స్థానాలలో టీడీపీ, నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఆ రెండు పార్టీల సీనియర్ నాయకులు కలిసి పనిచేయడం లేదు. బీజేపీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

టీడీపీ సీనియర్లు సైతం కమలం అభ్యర్థులతో కలిసి వెళ్లడం లేదు. కొందరు బీజేపీ అభ్యర్థులైతే టీడీపీ కండువాలు సైతం వేసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థులు మాత్రం కాషాయం కండువాలను మెడలో వేసుకుంటున్నారు. బీజేపీకున్న ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు కొందరు బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం ఇరు పార్టీల అభ్యర్థులపై పడనుండటం చర్చనీయాంశం అవుతోంది.

నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా యెండల లక్ష్మీనారా యణ పోటీ చేస్తున్నారు. దీనిపరిధిలోకి జిల్లాలోని ఐదు సెగ్మెంట్లు వస్తాయి. నిజామాబాద్ రూరల్, అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులు గడ్డం ఆనందరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త పోటీలో ఉండగా బోధ న్, ఆర్మూరు, బాల్కొండలో టీడీపీ అభ్యర్థులున్నారు. అయితే, ఇక్కడ సమన్వయం కుదరక కేవలం అసెంబ్లీ వరకే ఎవరికీ ప్రచారం చేసుకోవడం ఇబ్బంది కరంగా ఉంది.

నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేయడం లేదని ఆ పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేశారు. పైగా ఆ పార్టీ కండువా వేసుకోవద్దని బీజేపీ హైకమాండ్ నుంచే ఆదేశాలున్నాయనడంతో టీడీపీ నేతలు విస్తుపోతున్నారు.

నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డికి టీడీపీ నుంచి స హాయ నిరాకరణ ఎదురవుతోంది. ఇ క్కడి ఓ సీనియర్ టీడీపీ నేత ఓ బల మైన ప్రత్యర్థికి లోపాయికారిగా ఒ ప్పందం కుదుర్చుకున్నాడన్న ప్రచా రం ఉంది. టీడీపీ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గం నుంచి కావాలనే ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకోగా చి వరి నిముషంలో ఆనందరెడ్డిని బరి లోకి దించారని అంటున్నారు.
 
బాల్కొండ నియోజకవర్గం కూటమి లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జు న్ రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా రు. బీజేపీకి టికెట్ ఖాయమన్న నమ్మకంతో ఇక్కడ పార్టీ కార్యక్రమాలను విస్తృతపర్చిన ముత్యాల సునీ ల్‌రెడ్డి నిరాశకు గురై నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిముషంలో పోటీ నుంచి తప్పుకున్నా.. ఆయన, క్యాడర్ దూరంగా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బానాల లక్ష్మారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉ న్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలుపుకుని తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, మూడు ప ర్యాయాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ కూడ టీడీపీ సహక రించడం లేదు.

ఆర్మూరు నియోజకవర్గం నుంచి పో టీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆ లూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివా స్ తదితరులు ఉత్సాహం చూపారు. వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అన్నపూర్ణ మ్మ తప్పుకోగా, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇరుపార్టీ ల మధ్య సమన్వయం లేదని అంటున్నారు.

బాన్సువాడ కోసం బీజేపీ గట్టిగా పట్టు పట్టింది. అనూహ్యంగా టీడీపీకి చెందిన బద్యానాయక్‌కు టికెట్ దక్కింది. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బద్యానాయక్‌కు బీజేపీ నాయకులు సహకరిం చడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

బోధన్‌లో టీడీపీ ఆవిర్భావం తర్వా త వరుసగా నాలుగుసార్లు విజయం సాధించగా, 1999, 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ కైవసం చేసుకుం ది. దీంతో బోధన్ నియోజకవర్గం టీడీపీ చేజారింది. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఉంటారని భావించారు. చివరి నిముషంలో టీడీపీ అభ్యర్థిగా మేకపాటి ప్రకాశ్‌రెడ్డిని దించడంతో పొసగడం లేదు.

జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలలో ఏడుసార్లు పోటీ చేసిన టీడీపీ మూడుసార్లు ఓటమిపాలు కా గా, 2009లో గెలుపొందిన హన్మంత్ సింధే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో చివరకు మద్దెల నవీన్ అనే వ్యక్తికి టికెట్ కట్టబెట్టారు. ఇక్కడ కలిసిరాని బీజేపీతో టీడీపీ అభ్యర్థి ఒంటరిపోరు చేస్తున్నారు.

కామారెడ్డి నుంచి 2009లో టీడీపీ నుంచి షబ్బీర్‌అలీపై గెలుపొందిన గంప గోవర్ధన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. అయితే బీజేపీ నేతగా సీరి యస్‌గా పనిచేసిన నిట్టూరు వేణుగోపాల్‌రావు ఇక్కడి నుంచి టికె ట్ ఆశించారు. చివరి నిముషంలో సిద్ధిరాములును ఆ పార్టీ బరిలోకి దిం పింది.దీంతో ఇటు బీజేపీలో ఓ వర్గం కలిసిరాక, అటు టీడీపీ సపోర్టు లేక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement