
సాక్షి, అమరావతి: శీతాకాల, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శుక్రవారం ఉదయం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా మధ్యలో ఆరు రోజులపాటు సెలవులు వచ్చాయి. 10, 13, 14, 15, 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో సభ జరగనుంది. కాగా, ఈ సమావేశాల్లో 27 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదించగా, 15 అంశాలపై చర్చ జరపాలని బీజేపీ ప్రతిపాదించింది.
అన్నింటిపైనా నిబంధనల మేరకు చర్చకు అవకాశం ఇవ్వాలని నిర్ణయిం చారు. ఏడు బిల్లులు ప్రవేశపెడతామని అధికార పక్షం తెలిపింది. సమావేశంలో సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. శాసన మండలి ఇన్‌చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశంలోనూ అసెంబ్లీ సమావేశాలకు అనుగుణంగా మండలి సమావేశాలూ నిర్వహించాలని నిర్ణయించారు.