
స్పీకర్ హుందాగా ఉండాలి: మేకపాటి
నెల్లూరు: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రైతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హుందాగా వ్యవహరించాలని సూచించారు. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు.
ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని నెల్లూరులో గురువారం మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.