చదివిన కాలేజ్లో అసిస్టెంటు ఫ్రొఫెసర్గా..
* మహానంది వ్యవసాయ కళాశాలలో చదివి..
* ఇక్కడే అసిస్టెంటు ఫ్రొఫెసర్‌గా
* పత్తి, శనగ నూతన వంగడాలపై పరిశోధనలు
మహానంది: చదివిన కళాశాలలో అధ్యాపకుడి పోస్టింగ్ రావడం కొద్ది మందికే దక్కుంది. ఆ కొద్ది మందిలో బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బి. వెంకట రవిప్రకాష్‌రెడ్డి ఒకరు. ఇతను మహానంది వ్యవసాయ కళాశాలలో 2006-10లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివారు. నాలుగేళ్ల తర్వాత( 21-02-2014లో) అదే కళాశాలలో అసిస్టెంటు ఫ్రొఫెసర్‌గా చేరారు. తాను ఎంచుకున్న జెనటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్(జన్యు, ప్రజనన) విభాగంలో విద్యార్థులకు వివిధ అంశాలపై విద్యను భోధిస్తున్నారు.
ఇతని త ల్లిదండ్రులు నారాయణమ్మ, నారాయణరెడ్డిలు వ్యవసాయం చేసేవారు. దీంతో రైతులకు తన వంతు సేవలందించాలి, వారి అభివృద్ధి కోసం పరిశోధనలు చేయాలని ఇతను వ్యవసాయ కోర్సును ఎంచుకున్నారు. పత్తి, శనగ రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. తెగుళ్లు. పురుగుల ఉధృతిని తట్టుకునే రకాలను తయారు చేయడమే తనలక్ష్యమని ఈయన తెలుపుతున్నారు.