సాక్షి, నెల్లూరు: విజయవాడలో కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన నెల్లూరు జిల్లా వాసులు ముగ్గురికి మంగళవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతులైన లలితాదేవి, హరిత, చిన్నారి అశ్వికల భౌతికకాయాలకు కురుగొండ గ్రామంలో అశ్రునయనాలతో అంత్యక్రియలు జరిపారు. వీరు సీపీఐ జాతీయ నేత కె. నారాయణ బంధువులు కూడా. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో కురుగొండ కన్నీటి సంద్రంగా మారింది. కుమార్తె, భార్య, తల్లిని పోగొట్టుకున్న అశ్విక తండ్రి ప్రభు కిరణ్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అంత్యక్రియలకు సీపీఐ నేత నారాయణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలివేటి సంజీవయ్య హాజరయ్యారు.
విజయవాడ సమీపంలోని ఫెర్రీ ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 22 మంది మృతి చెందారు. ఒక్క ప్రకాశం జిల్లాకు చెందిన వారే 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment