చోడవరం: విశాఖ జిల్లా చోడవరం మండలం పరిధిలో ఉచిత ఇసుకకు డబ్బులు వసూలు చేస్తూ దందాకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఇద్దరిపై పనోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. చోడవరం మండలం జుత్తాడ గ్రామ సర్పంచ్ కొణతాల రామపెద్దప్పడు, గౌరీపట్నం సర్పంచ్ వరహాలబాబులు ఉచిత ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు అందడంతో పోలీసులు సుమోటోగా బైండోవర్ కేసులు నమోదు చేసి ఆర్టీవో కోర్టుకు తరలించారు.