వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం జరిగే జిల్లా బంద్‌లో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆర్టీసీ పూర్తిగా సహకరించాలని కోరారు. కాగా, బంద్‌కు సీపీఐ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్ సందర్భంగా ఆటోలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రీజినల్ సెక్రటరీ డీఆర్‌రెడ్డి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నా శివకుమార్, కక్కెర్ల అనిల్‌కుమార్ బంద్‌కు మద్దతు తెలిపారు.
నేడు బంద్
Published Thu, Dec 5 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement