ఆంధ్రప్రదేశ్ సర్కార్కు బ్యాంకర్లు షాక్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్యాంకర్లు షాక్ ఇచ్చారు. ఇరవై శాతం మాత్రమే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేశారు. అది కూడా 20 శాతమే నిధులు చెల్లించాకే రుణాలు ఇస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో రూ.20వేల అప్పు ఉన్న రైతులకు రూ.4వేలు మాత్రమే కొత్త రుణం రానుంది. ఇక రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతుకు కేవలం రూ.30వేలు మేరకు కొత్త రుణం పుట్టే అవకాశం ఉంది. దీంతొ రైతులకు ఖరీఫ్ రుణాల్లో భారీ కోత పడనుంది.
మరోవైపు గడువు ముంచుకొస్తున్నా రుణమాఫీ లబ్దిదారుల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నెల 22న నిధులు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఈ నెలాఖరు వరకూ ఖరీఫ్ రుణాల మంజూరు గడువు పెంచాలని విజ్ఞప్తి చేసింది. అయితే వారం రోజుల్లో కొత్త రుణాల ప్రక్రియ ఎలా సాధ్యమని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు.