అనంతపురం టౌన్: అక్రమ తుపాకీ కొనుగోలు వ్యవహారంలో బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు ఆదివారం అనంతపురం డీఎస్పీ కార్యాయలంలో హాజరయ్యారు. నలుగురు వ్యక్తులు 10 రోజుల క్రితం తుపాకీతో రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడిన సంగతి తెల్సిందే. ఆ నలుగురు వ్యక్తులు విచారణలో బళ్లారి ఎంపీ పేరు చెప్పడంతో పోలీసులు బళ్లారి వెళ్లి ఎంపీ శ్రీరాములుకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో ఆదివారం డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.