రాముడిపై భక్తితో కాదు.. హుండీపై మోజుతోనే భద్రాద్రిపై కన్ను సీమాంధ్రులు గద్దల్లా ఎత్తుకెళితే ఊరుకోం: విమలక్క
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఖనిజ సంపదను, పాపికొండలను, గోదావరి జలాలను గద్దల్లా ఎత్తుకెళ్లడానికే సీమాంధ్రులు భద్రాచలం ప్రజలపై, ఆదివాసీలపై కపట ప్రేమను చూపిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ధ్వజమెత్తారు. కానీ, ఈ అడవి మాదే, దానిపై హక్కు మాదేనని ఆమె నినదించారు. భద్రాచలాన్ని సీమాం ధ్రలో కలపవద్దంటూ జరుగుతున్న దీక్షా శిబిరాలను శని వారం విమలక్క సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడిపై భక్తితో సీమాంధ్రులు భద్రాచలాన్ని అడగటం లేదని, రాముడి హుండీపై మోజుతోనే కావాలంటున్నారని విమర్శిం చారు. అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, ఆంధ్రా భూములను సస్యశ్యామలం చేయటానికే భద్రాద్రిని కలుపుకోవాలని సీమాంధ్ర నాయకులు గుంటనక్కల్లా తొంగి చూస్తున్నారన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే అంగీకరిస్తామని, హైదరాబాద్, భద్రాచలం జోలికి వస్తే సహించేదిలేదని, వాటిని కావాలన్నవారిని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కిరణ్ కల్లు తాగిన కోతిలా.. సీమాం ధ్రులకు తొత్తుగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేలా.. గంటకో మాట, పూటకోమాట మాట్లాడుతున్న సీఎంకు మతిభ్రమించిందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాంనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్, భద్రాచలం లేకుంటే తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏనుగు తిన్న వెలగపండులా ఉంటుంద న్నారు.
తెలంగాణ విద్యార్థుల ‘భద్రాద్రి గర్జన’
భద్రాచలం పరిరక్షణ కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుభం ఫంక్షన్ హాల్‌లో ‘భద్రాద్రి గర్జన’ జరి గింది. విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపితే.. ఆదివాసీ విద్యార్థుల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు.భద్రాచలంపై సీమాంధ్రుల చూపు పడితే, ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే ప్రజల ఆకాంక్షను 26లోగా జాతీయస్థాయిలో తెలియచెబుతామని గాంధీ పథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. ఒప్పుకో కుంటే పోరు ఉధృతమవుతుందని హెచ్చరించారు.
అడవి మాదే.. హక్కు మాదే
Published Sun, Nov 24 2013 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement