చర్చ జరక్కుంటే చాలా నష్టం:వెంకయ్య నాయుడు
హైదరాబాద్: కేంద్ర క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి వచ్చిన రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై కూలంకషంగా చర్చ జరగాలని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోగతాలను ఆవిష్కరించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, సురేష్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
నిర్మాణాత్మక చర్చ జరక్కపోతే నష్టమే ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తూనే సీమాంధ్ర ప్రజల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైన, పార్లమెంటుపైన ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తానూ చెప్పాల్సింది చాలా ఉందని, ఓ రోజు తప్పక చెప్తానన్నారు.