మాట్లాడుతున్న గవర్నర్ హరిచందన్. సమీక్షలో పాల్గొన్న సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటం ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఏర్పాటు చేసి ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తుండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
► టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్, ట్రీట్‌మెంట్ పద్ధతిని అనుసరిస్తూ ప్రభుత్వం కరోనా కట్టడికి సరైన చర్యలు చేపడుతోందన్నారు.
► కోవిడ్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు.
► పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గవర్నర్‌కు వివరించారు.
► రోజుకు దాదాపు 40వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.
► పరీక్షలు నిర్వహించిన 24గంటల్లోనే ఫలితాలు వచ్చేలా లేబరేటరీల పనితీరును క్రమబద్ధీకరిస్తున్నామని, ఎవరైనా 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కరోనా పరీక్ష చేయించుకోవచ్చని, కరోనా సోకిన వారు కాల్‌సెంటర్ ద్వారా ఆసుపత్రుల్లో చేరొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment