మహిళపై వేధింపులకు పాల్పడ్డ బీజేపీ నేత అరెస్టు | BJP youth wing leader held for harassing woman | Sakshi
Sakshi News home page

మహిళపై వేధింపులకు పాల్పడ్డ బీజేపీ నేత అరెస్టు

Oct 27 2014 4:56 PM | Updated on Sep 26 2018 6:09 PM

ఓ మహిళపై అసభ్యకర మెస్సేజ్ లతో వేధింపులకు పాల్పడ్డ బీజేపీ యువ నాయకుడు గాజుల వెంకయ్య నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్:ఓ మహిళకు అసభ్యకర మెస్సేజ్ లు పంపుతూ తరుచు వేధింపులకు పాల్పడ్డ బీజేపీ యువ నాయకుడు గాజుల వెంకయ్య నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు మెయిల్స్ రూపంలో  అసభ్యకర మెస్సేజ్ లను పంపుతున్నాడనే మహిళ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లాలో అతని స్వగ్రామమైన తెనాలిలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం హైదరాబాద్ కు తరలించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలల నుంచి అతను అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

దాంతో పాటు ఫోటోలను కూడా మార్చి తనను తరుచు బెదిరిస్తున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఇదే కేసులో అతను గత సంవత్సరం మే నెలలో అరెస్టయ్యాడు. అయితే తిరిగి జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమెను వేధించడంతో ఆరంభించాడు.  దీంతో ఆ వేధింపులు భరించలేని ఆమె గతేడాది అక్టోబర్ లో ఆత్మహత్యాయత్నం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement