
సాక్షి, కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సోమసుందర్ అనే 12సంవత్సరాల బాలుడికి ఎన్‌టీఆర్ ఆరోగ్య శ్రీ కింద డాక్టర్లు వైద్యం చేశారు. అయితే, ఆ వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
సరైన విధంగా వైద్యం అందించలేదని, బాలుని మృతికి డాక్టర్లే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. డాక్టర్లు డబ్బులకు ఆశించడం, నిర్లక్ష్యం చేయడం వల్లే బాలుడు మృతి చెందాడని వారు తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి నిజాన్ని నిగ్గు తేలుస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి మృతికి గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment