ఆ చెల్లి పదో తరగతి పరీక్షలు రాస్తోంది.. తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొద్దామని బైక్‌పై బయలుదేరిన ఆ అన్నను మృత్యువు కబళించింది..
దేవరకద్ర, న్యూస్‌లైన్ : ఆ చెల్లి పదో తరగతి పరీక్షలు రాస్తోంది.. తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొద్దామని బైక్‌పై బయలుదేరిన ఆ అన్నను మృత్యువు కబళించింది.. విషయం తెలిసిన చెల్లీ తన వేదనను దిగమింగుకుని అలాగే పరీక్ష రాసిం ది.. ‘అన్నా.. ఇక నన్ను చూడకుండా నే తిరిగిరాని లోకాలకు చేరుకుంటివా..’ అని సోదరి గుక్కతీసుకోకుండా రోదించింది.
దీంతో ఆ కుటుంబంలో విషా దం అలుముకుంది.. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దరాజమూర్‌కు చెందిన కృష్ణయ్య, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్‌కుమార్ (17) దేవరకద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. ప్రస్తుతం కూతురు అఖిల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తోంది.
ఎప్పటిలాగే గురువారం ఉద యం తొమ్మిది గంటలకు పరీక్ష రాయడానికి ముందుగానే బస్సులో వెళ్లింది. అనంతరం ఇంటికి తిరిగి తీసుకొద్దామని బైక్‌పై అన్న దేవరకద్రకు చేరుకున్నాడు. అంతలోనే స్నేహితులు మైబు, మోహన్ కనిపించడంతో వారిని బైకుపై ఎక్కించుకుని పట్టణంలోకి వచ్చాడు. తరువాత తిరిగి పరీక్ష కేంద్రానికి వెళుతుండగా పాఠశాలకు కొద్దిదూరంలో ఎదురుగా వచ్చిన హైదరాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతనితో పాటు మైబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థాని కులు వెంటనే క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే అనిల్‌కుమార్ మృతి చెందా డు.
ఈ సంఘటన జరిగినప్పుడు చెల్లెలు అఖిల పరీక్ష రాస్తోది. మధ్యాహ్నం విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరయింది. ‘నీకోసం వస్తూ అన్నయ్య.. మనకు కనిపించని లోకాలకు వెళ్లాడు..’ అని తల్లి చేసిన రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్‌ఐ రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం అనిల్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.