
ఆర్టీసికి పండగ!
హైదరాబాద్: ఆర్టీసికి శుభవార్త. ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేశారు. ఆర్టీసి చెల్లించవలసిన బకాయిలను గ్రాంట్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఆర్టీసీ బకాయి పడ్డ వాహన పన్ను 1116 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా రద్దు చేశారు. ఈ రకమైన రుణాలు, బకాయిలను రెండు రాష్ట్రాలకు బదలాయించడం ఇబ్బందికరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.