ప్రొద్దుటూరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు కంపచెట్లల్లో పడేశారు. ఇందులో చాలా వరకు మందులు ఇంకా కాలం చెల్లనివి, ఉండగా మరి కొన్ని కాలం చెల్లినవి కూడా కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని మడూరు రోడ్డు వీదుగా హౌసింగ్ బోర్డుకు వెళ్లే రహదారి పక్కన ఉన్న కంపచెట్లలో పెద్ద ఎత్తున మందులు కనిపించాయి. కాలం తీరిన మందులు ఎవరైనా ఎజెన్సీల వారు పడేసి ఉంటారని వాటిని పరిశీలించగా అందులో అన్నీ ప్రభుత్వం సరఫరా చేసిన మందులే ఉన్నాయి. విటమిన్ మాత్రలు, సిర ప్‌లు, గర్భం నిర్ధారణ చేసే స్లిప్‌లు, సిరంజిలు ఎక్కువగా కనిపించాయి. ప్యారాసిటమాల్ ఓరల్ సస్పెన్షన్ ఐపీ బ్యాచ్ నెంబర్ 15033బీజీ139 ఉన్నాయి. ఇవి 2015 ఏప్రిల్ నెల వరకు ఉపయోగించగలిగినవి ఉన్నాయి. అలాగే ఆల్‌బిల్‌డాజోల్ ట్యాబ్లెట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు, విటమిన్ ఏ అండ్ డీ ట్యాబ్లెల్లు పెద్ద ఎత్తున పడేసి ఉన్నాయి. వీటన్నిటికి ఈ ఏడాది డిసెంబర్ వరకు కాలపరిమితి ఉంది.
కంపచెట్లలోకి ఎలా వచ్చాయి....
ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులు రోడ్లపై, కంపచెట్లల్లోకి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చే యాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మందుల బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి జిల్లా ఆసుపత్రి మందులా లేక, అర్బన్ హెల్త్ సెంటర్లకు సరఫరా చేసిన మందులా, మండల పరిధిలోని ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉంది.
కాలం ఉన్నా రోడ్లపై పడేయడానికి గల కారణాలపై కూడా అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు కాలం తీరినా కూడా అవి రోడ్లపై పడేయటానికి వీలు లేదని వైద్యులు చెబుతున్నారు. వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించి వేరే మందులు పొందాలని నిబంధన ఉంది. అలాంటి ది మందులను రోడ్లపాలు చేసిన వారిని ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
నిర్లక్ష్యం
Published Sun, Jul 27 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement