
జగన్ కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇందూ టెక్ ప్రాజెక్టు, లేపాక్షి నాలెడ్జి హబ్లకు సంబంధించి ఈ ఛార్జి షీట్లు దాఖలు చేశారు. 8 డబ్బాలలో ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ కోర్టుకు తీసుకువచ్చింది.
లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్లో మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొంన్నారు. 9వ నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి పేరుని, 11వ నిందితుడిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని చేర్చారు. ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, శ్రీనివాస బాలాజీ, శ్యామ్యూల్, మురళీధర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పేర్లను కూడా పేర్కొన్నారు.
ఇందూ టెక్ ప్రాజెక్టు ఛార్జి షీట్లో పది మంది నిందితులుగా పేర్కొన్నారు. 8వ నిందితురాలిగా సబితా ఇంద్రారెడ్డిని పేరు చేర్చారు. బిపి ఆచార్య, శ్యాంప్రసాద రెడ్డి, రత్న ప్రభ పేర్లను కూడా చేర్చారు.