సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వైఎస్ వివేకా కేసులో ఎల్లో మీడియాలో ఇప్పటికే తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాత్ర ఉందనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టులో సీబీఐ చెప్పిన అంశాలను మీడియాలో విస్తృతంగా చెప్పాలని, దీనివల్ల వైఎస్సార్‌సీపీ ఇమేజ్‌ను దెబ్బతీయ వచ్చని సూచించారు. వివేకా మరణం సీఎం జగన్‌కు ముందే తెలుసని అజేయ కల్లం వంటి వారు కూడా చెప్పారనే విషయాలను పదేపదే చెప్పాలని సూచించినట్లు తెలిసింది.
ఇక పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే కీలకమని, ప్రధాని చేతుల మీదుగానే పార్లమెంటు ప్రారంభించడమే సముచితమని చంద్రబాబు సహా పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీని తామే ప్రారంభించిన విషయాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు. ఆర్–5 జోన్‌లో ప్రభుత్వం పట్టాలిచ్చిన విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment