తిరుమలలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా
తిరుమల : శ్రీవారి దర్శనార్థం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆదివారం తిరుమలకు వచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆయన స్థానిక శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ మేరకు మంత్రికి టీటీడీ రిసెప్షన్ డెప్యూటీ ఈవో ఆర్1 రామారావు, అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. జయంత్ సిన్హా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.